తాండూర్‌లో బ్రదర్స్ పాలన కొనసాగుతుంది : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

by Aamani |
తాండూర్‌లో బ్రదర్స్ పాలన కొనసాగుతుంది : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
X

దిశ, తాండూరు : పట్నం మహేందర్ రెడ్డి కి సిగ్గు లేదని,రాష్ట్రంలో తాండూరులో అన్నదమ్ముల పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూరు పట్టణంలో ఆయన నివాసంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాండూరు అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలకు కూడ ఏమి చేయకపోడంతోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఓడించారన్నారు. ఇక్కడి నుంచి మల్కాజ్గిరి వెళ్లి అక్కడా తాండూరుతో సంబంధం లేదని నాటకాలు ఆడారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవి కోసం ప్రాకులాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజల్లో ఆదరణ కరువైందని, ఖేల్ ఖతం అయ్యిందన్నారు. ఏమాత్రం ఇజ్జత్ ఉన్నా తాండూరుపై రాజకీయాలను మానుకోవాలని విమర్శించారు.తాండూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ప్రస్తుతం బ్రదర్స్ పాలనతో బ్రష్టు పట్టి పోతుందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేతగాని సర్కారుతో జతకట్టి పదవి కోసం పాకులాడటం చీఫ్ విప్ కి సిగ్గుచేటని పట్నంపై పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యాడు.అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరిస్తే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.

ఇక తాండూర్ లో ప్రజా పాలన కాదు బ్రదర్స్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు బ్రదర్స్, తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు బ్రదర్స్ వల్ల పాలన దిగజారి పోతోందని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టే పాలన చేస్తోందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను విస్మరిస్తోందని ఆరోపించారు.గతంలో తాండూరు అభివృద్ధి కోసం తాను తీసుకొచ్చిన పనులను పూర్తి చేయడం లేదన్నారు. లారీ పార్కింగ్, చిలుకవాగు, గొల్ల చెరువు, తాండూరు వికారాబాద్ రోడ్డు పనులతో పాటు నియోజకవర్గంలోని రోడ్లను పనులను పక్కన పెట్టారని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు గౌడ్, అఫ్ప,అబ్దుల్ సలీం, రవీందర్ రెడ్డి, నర్సి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story