- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించిన సర్కార్
X
దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం దసరా పండగకి మరో శుభవార్త తెలిపింది. తెలంగాణ ఆరోగ్యశాఖలో 371 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. 371 ఉద్యోగాల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు ఉండగా.. 99 ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. కాగా గత సెప్టెంబర్లోనే 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రస్తుతం విడుదల చేసిన 371 పోస్టుల ప్రకటన, గతనెల నోటిఫికేషన్ కు అనుబంధంగా కొనసాగనుంది. కాగా మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్లతోపాటు, 99 ఫార్మసిస్టు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులకు అక్టోబర్ 14 వరకు తుది గడువు ఉండగా.. నవంబర్ 17న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
Next Story