Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Hamsa |   ( Updated:2024-10-11 14:35:27.0  )
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా.. వశిష్ట(Mallidi Vassishta) దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara). సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో త్రిష(Trisha), అషిక రంగనాథ్(Ashika Ranganath) ’హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మరో ఐదుగురు చిరు చెల్లెల్లుగా నటించబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విశ్వంభర(Vishwambhara) నుంచి విడుదలైన అప్డేట్స్ చిరు ఫ్యాన్స్‌లో జోష్ నింపాయి.

అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ (Teaser)ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, చిరు అభిమానులకు దసరా గిఫ్ట్ ఇచ్చేశారు విశ్వంభర(Vishwambhara) మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విజయదశమి (Vijayadashami) నాడు అంటే రేపు అక్టోబర్ 12న ఉదయం 10: 49 గంటలకు విడుదల కాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Advertisement

Next Story