- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజా శ్రేయస్సే తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలిపింది
దిశ, నిజామాబాద్ :
ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పాటుపడటం వల్లే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కామారెడ్డి ఆర్ఆండ్‌బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ..29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆరేండ్లు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలో ఆడుగుపెడుతోందని వివరించారు. ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం వల్లే రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజల అవసరాలను తీర్చేదే నిజమైన ప్రభుత్వమని, ఆ బాటలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పయనిస్తున్నదని చెప్పారు.ఎవరు కోరకపోయినా నీటి అవసరాలు తీరుస్తూ, రైతుల రుణ బకాయిలు మాఫీ చేశామన్నారు. అలాగే కాలేశ్వరం చివరి పనులను పూర్తిచేసి కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌కు నీటిని తరలిస్తున్నట్టు తెలిపారు. సాగునీరు, తాగు నీరు, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో 100పడకల మాతా, శిశు ఆస్పత్రి నిర్మాణం చేశామని, వైద్య అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను కూడా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టంచేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసన సభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేంధర్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.