శ్రీవారి దర్శనార్ధం ప్రత్యేక ప్రవేశ టికెట్లు..!

by srinivas |   ( Updated:2020-09-07 05:22:04.0  )
శ్రీవారి దర్శనార్ధం ప్రత్యేక ప్రవేశ టికెట్లు..!
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 15 వ తేదీ, 19-27వ తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‎లైన్‎లో విడుదల చేయనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్ణయించినందున.. ఈ నెల 15వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‎లైన్‎లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed