- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అడవుల్లో ‘రంగుల పున్నమి’
దిశ, ఆదిలాబాద్: ఆ ప్రాంతానికే ఓ ప్రత్యేకత ఉంది. ఇగ అక్కడ నివసించే ఆ మనుషులూ ప్రత్యేకమే. అంతేకాదు వారందరూ అట్టహాసంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో స్పెషల్ గా ఓ పదార్థాన్ని తయారు చేస్తారు. దానిని తింటే సంవత్సరంపాటు రోగాలు రాకుండా చేస్తుంది. ఇలా అన్నిటిలో భిన్నత్వాన్ని చూపిస్తూ మనల్ని ఎంతగానో అలరించే ఆ మనుషులపై ప్రత్యేకత కథనం..
ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసులు ‘కుడుకల’ పండుగ నిర్వహిస్తున్నారు. ఈ పండుగ ఎంతగానో అలరిస్తున్నది. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవనశైలికి దురాడీ కోబ్రె(కుడుకుల) పండగ అద్దం పడుతోంది. ఆదిమ గిరిజన గూడాల్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ పండుగను రంగుల పున్నమిగా భావిస్తారు.
మూడ్రోజుల పండుగ…
హోలీ పండుగ సమయంలో ఆదివాసులు దురాడీ కోబ్రె పండుగను మూడ్రోజుల పాటు జరుపుకుంటారు. పున్నమికి ఒకరోజు ముందు, ఆ తర్వాత రోజు కూడా ఉత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో తమ ఆరాధ్య దైవంగా భావించే “మాతరి”, “మాత్రే “లను ఘనంగా పూజిస్తారు. అందులో భాగంగా సంప్రదాయబద్ధంగా వాయిద్యాల నడుమ దేవతలను ఆదివాసులు తమ ఇంటికి తీసుకెళ్లి మొక్కులు తీర్చుకుంటారు.
అలరించే దురాడీ కోబ్రె…
గూడాల్లో మాతరి, మాత్రేల ఇల్లిల్లు తిరిగిన అనంతరం ఈ దేవతలను గ్రామ పొలిమేరలకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత గూడెంలో ఉండే వాళ్లంతా ఒక్కొక్కరు ఒక కుడుక తీసుకువెళ్లి రాయిసిడాం(గ్రామ పటేల్)కు ఇస్తారు. అలా ఆరోజు ఆయన వద్దకు ఎన్ని కుడుకలు వస్తే ఆ గూడెంలో అంత జనాభా ఉన్నట్టు పరిగణిస్తారు. తన వద్దకు వచ్చే వారందరికీ పటేల్ చక్కరి పేర్లను ఇచ్చి రంగుల పున్నమి శుభాకాంక్షలు తెలుపుతారు. ఇదంతా ఒక పండుగ వాతావరణంలో ప్రతి గూడెంలో సంబురంగా జరుపుకుంటారు. సోమ, మంగళ వారాల్లో గ్రామ పొలిమేరల్లో పొడవాటి కట్టెలు కట్టి వాటికి మాతరి, మాత్రేలను అలంకరిస్తారు. చుట్టూ కుడుకలను అల్లి పటేల్ సమక్షంలో దహనం చేస్తారు. ఆ తర్వాత కాలిన కుడుకలను ఒక్క దగ్గర చేరుస్తారు.
ప్రసాదం తింటే రోగాలు రావు: ఆదివాసులు
కాలిన కుడుకలను ఆదివాసీ మహిళలు బాగా దంచి, దానితో వేయించిన నువ్వులు, బెల్లంతో ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నైవేద్యంగా భావిస్తారు. సహజసిద్ధమైన ఈ ప్రసాదం ఏడాది పొడవునా శ్వాసకోశ రోగాలు రాకుండా, రక్తవృద్ధి, జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆదివాసులు నమ్ముతారు. ఇది నిజంగానే ప్రభావశీలంగా పనిచేస్తుందని నిర్మల్ కు చెందిన ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ రనీత్ కుమార్ కూడా చెప్పారు.
Tags: rangula punnami, holi, Adilabad, Adavulu, special, prasadam