- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెబ్ సిరీస్ : స్పెషల్ ఆప్స్ రివ్యూ
దిశ, వెబ్‌డెస్క్:
స్పై థ్రిల్లర్ కథలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటూనే ఉంటుంది. ఇక ఈ డిజిటల్ యుగంలో చాలా స్ట్రీమింగ్ సర్వీసుల్లో ఇలాంటి కథనాలతో సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ భాషల్లో ద ఫ్యామిలీ మ్యాన్, కోడ్ ఎం, బార్డ్ ఆఫ్ బ్లడ్, ఆపరేషన్ కోబ్రా సిరీస్‌లు ఉన్నాయి. అయితే ఇటీవల హాట్‌స్టార్‌లో విడుదలైన స్పెషల్ ఆప్స్ సిరీస్ కూడా ఆ కోవకు చెందినదే. కానీ కావాల్సినంత కొత్తదనం ఇందులో కనిపిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అద్భుతమైన యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ కథనాన్ని కూడా అందించడంలో సఫలమైనట్లుగా కనిపిస్తోంది.
కథలోకి వెళ్తే…
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో సీనియర్ ఆఫీసర్‌గా పనిచేసే హిమ్మత్ సింగ్ (కేకే మీనన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారతదేశంలో 2001 పార్లమెంట్ బాంబు దాడి నుంచి 2011 ముంబై పేలుళ్ల వరకు ఉగ్రవాద దాడులన్నిటి వెనకాల ఒకరి హస్తమే ఉందని హిమ్మత్ నమ్ముతుంటాడు. తన నమ్మకాన్ని నిరూపించడానికి సాక్ష్యాల కోసం 19 ఏళ్లుగా ఒక ఆపరేషన్ నడుపుతుంటాడు. అందులో భాగంగా ఒక నలుగురితో జట్టు తయారు చేసుకుని టెర్రరిస్ట్‌ల మీద కన్నేసి ఉంచుతాడు. ఓ వైపు అధికారుల రెడ్ టేపిజం, మరోవైపు తీవ్రవాద ముఠాను బయటపెట్టాలన్న కసి హిమ్మత్‌ని సమస్యల్లో పడేస్తాయి.
కొత్తదనం సంగతి…
భారత డిజిటల్ మీడియాలో స్పెషల్ ఆప్స్ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోబోతోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. మొదటి ఎపిసోడ్ చూశాక పూర్తిగా ఎనిమిది ఎపిసోడ్లు చూసేయాలనిపించే ఉత్కంఠను కలిగించేలా నీరజ్ పాండే తెరకెక్కించారు. కాల్పనిక కథను, నిజానిజాలను చక్కగా లింక్ చేసి చూపించడంలో నీరజ్ విజయం సాధించారు. ఆయనకు తగినట్లుగా నటీనటులు కూడా పోటాపోటీగా నటించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా తన జట్టును కేంద్రీకృతం చేసే సమయంలో, గవర్నమెంట్ ఆడిట్ నుంచి బయటపడే సీన్లలో కేకే మీనన్ నటన ఆకట్టుకుంటుంది. అలాగే వినయ్ పాఠక్, సజ్జద్ డెలప్రూజ్, సయామీ ఖేర్, ముజామిల్ ఇబ్రహీం, మెహెర్ విజ్, దివ్య దత్తా తమ పాత్రలకు న్యాయం చేశారు.
అక్కడక్కడా జాక్ రయాన్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాలను తలపించినట్లు అనిపించినప్పటికీ ఎలాగూ కరోనా హాలీడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్‌ను చూసేస్తే సరిపోతుంది.
Tags: Special Ops, Hotstar, Web Series, KK menon