- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేటు బస్సుల తనిఖీలు షురూ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం, ఒకే అనుమతి తీసుకుని పలు సర్వీసులను నడుపుతుండడం, కరోనా నిబంధనలను పాటించకపోవడం, పన్ను చెల్లించకుండానే సర్వీసులను తిప్పుతుండడం లాంటివాటిని తనిఖీ చేసేందుకు రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు నగరం మొత్తం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కూకట్‌పల్లి నుంచి పంజాగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్ సంస్థలకు చెందిన బస్సులను అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీ చేపట్టారు. పండుగ మరుసటి రోజు వరకు ఈ తనిఖీలను కొనసాగించనున్నట్లు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సర్వీసులపై జరిమానా విధించడంతో పాటు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకున్న బస్సులపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.