పోలీసులా రౌడీలా : లంచం కోసం వివాహిత మీద కూర్చుని.. వీడియో వైరల్

by Anukaran |
si-mahender-patel
X

దిశ, వెబ్‌డెస్క్ : బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులే డబ్బుల కోసం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్న ఓ వివాహితను.. కింద పడేసి మీద కూర్చుని ఓ పోలీసు అధికారి దాడి చేశాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ డెహత్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగవైరల్ అవుతోంది.

వివరాల్లోకివెళితే.. డెహత్‌ జిల్లా దుర్గాదాస్‌పూర్‌ గ్రామంలో తన భర్తను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, వదిలిపెట్టాలంటే లంచం ఇవ్వాలని భోగిన్‌పూర్‌ ఎస్సై మహేంద్ర పటేల్‌ డిమాండ్‌ చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తాను ఇవ్వలేనని చెప్పడంతో లాగి నేల మీద పడేసి కొట్టాడని, మీద కూర్చుని ముఖం మీద దాడి చేశాడని వాపోయింది. గ్రామస్తుల జోక్యం వలన ఆ అధికారి తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తంచేసింది.

ఇదిలాఉండగా, ఆ వివాహిత భర్త శివం యాదవ్‌ స్నేహితులతో కలిసి జూదం ఆడుతున్నాడని, అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, వాళ్లే తన బృందంపై దాడి చేశారని ఎస్సై పటేల్‌ వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కాన్పూర్‌ ఎస్పీ చౌదరి స్పందిస్తూ.. శివం పారిపోయేందుకు అతని భార్య ఎస్సైను అడ్డగించే ప్రయత్నం చేసిందని పటేల్‌ భావించాడని.. అందుకే అలా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చారు. అతనిపై వచ్చిన ఆరోపణల కారణంగా పటేల్‌ను భోగిన్‌పూర్‌ విధుల నుంచి తప్పించి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్‌ ఎస్పీ చౌదరి తెలిపారు.

Advertisement

Next Story