ఎన్ కౌంటర్ మృతులు వీరే…

by Admin |   ( Updated:2022-09-09 07:15:12.0  )
ఎన్ కౌంటర్ మృతులు వీరే…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మహా రాష్ట్ర గడ్చిరోలి జిల్లా దానోరా సబ్ డివిజన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ వివరాలను ఎస్పీ అంకిత్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ధానోరా సబ్ డివిజన్‌లోని ఘ్యారాపట్టి సమీపంలోని మౌజా, కిస్నేలి అటవీ ప్రాంతంలో సీ -60 కమెండోలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని ఎస్పీ తెలిపారు. కమాండోలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోలు హతం అయ్యారని ఆయన చెప్పారు. ఇందులో నలుగురు మహిళలు, ఒక పురుషుడు చనిపోయారని చెప్పారు. కాగా మృతుల్లో ఒకరిని… ధనోరా ప్రాంతంలోని ముంగ్నర్‌కు చెందిన ప్లాటూన్ 15 దళ సభ్యురాలు సమిత అలియాస్ రాజో కిర్కో (34)గా గుర్తించామన్నారు. గడ్చిరోలి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సమితపై 2 హత్యలు, 9 ఎదురు కాల్పుల ఘటనలు, 3 ఇతర కేసులు నమోదు కాగా ఆమెపై రూ. 4 లక్షల రివార్డు ఉందని చెప్పారు. మరొకరు టీవీసీఎం శ్రీజనక్కకు బాడిగార్డ్‌గా ఉన్న కుతేజరి తాల్‌కు చెందిన కుమ్లి చిప్లూరం గావ్డే (23) అని తెలిపారు. ఈమెపై 2 కేసులు నమోదు కాగా, రూ.2 లక్షల రివార్డు ఉందని ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పాడు. టిప్పగాడ్ దళ మెంబర్ సుమన్ అలియాస్ జుంకి అలియాస్ సుల్కి బ్రిచా (32)పై మొత్తం 21 కేసులు ఉండగా, రూ. 6 లక్షల రివార్డు ఉందన్నారు. చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా బస్తర్ ఏరియా ప్లాటూన్ 15 మెంబర్ గా పనిచేస్తున్న చందా అలియాస్ చందన అలియాస్ మాస్ భాల్సే (25)పై రూ .4 లక్షల రివార్డు ఉందని చెప్పారు. తిప్పాగాడ్ దళ సభ్యునిగా పని చేస్తున్న తీరా అలియాస్ నీలేశ్ అలియాస్ శివాజీ దర్సు మాడవి (30)పై 6 హత్యలు, 7 ఎదురుకాల్పులు, 7 ఇతర కేసుల్లో నిందితుడని, ఇతనిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed