తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చేది ఎప్పుడంటే..!

by srinivas |
Southwest monsoon
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణశాఖ అధికారుల అంచనాల ప్రకారం కేరళాకు జూన్ 6న ప్రవేశించాల్సిన రుతుపవనాలు రెండు రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed