క్రికెట్ పసికూనలపై సఫారీల సవారీ..

by  |
క్రికెట్ పసికూనలపై సఫారీల సవారీ..
X

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా మహిళా జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ బీ విభాగంలో శుక్రవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ ఈవెంట్స్‌లో 195 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతకు మునుపు ఈ రికార్డు భారత జట్టు (194) పేరిట ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సఫారీ ఓపెనర్ బ్యాట్స్‌ఉమన్ లీజెల్లీ లీ 60 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో 101 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరందించింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పసికూన థాయ్‌లాండ్ జట్టు నాలుగు ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. చివరకు 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌవుటైంది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్లాయిల్‌, సున్‌ లూస్‌లు తలా మూడు వికెట్లు, ఎమ్‌లాబా, నీకెర్క్‌, డీక్లెర్క్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.

Advertisement

Next Story

Most Viewed