- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేస్ కారు నడిపిన గంగూలీ
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం యూఏఈలో పలు పనుల ఒత్తిడిలో ఉన్నారు. ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ, టీ20 వరల్డ్ కప్ వేదిక తరలింపు వంటి విషయాలను ఈసీబీ, ఐసీసీలతో చర్చించడానికి దుబాయ్ వెళ్లారు. కాగా, కాస్త విరామం దొరకడంలో ఆయన రేస్ కారు నడిపి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
దుబాయ్‌లోని వేడిని ఈ రేస్ కార్ మరింత రెట్టింపు చేస్తున్నదని దానికి క్యాప్షన్ పెట్టాడు. మరో ఫొటోలో మాస్క్ లేకుండా కనిపించాడు. ‘దుబాయ్ నన్ను లాక్‌డౌన్ నుంచి విడుదల చేసింది’ అని సందేశం జోడించాడు. కాగా, సౌరవ్ గంగూలీ ఇటీవల గుండెనొప్పి కారణంగా స్టంట్ వేయించుకున్నారు. పూర్తి విశ్రాంతి అనంతరం ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం చెన్నై వెళ్లారు. ఐపీఎల్ వాయిదా పడటంతో కోల్‌కతాలోని ఇంటికే పరిమితం అయ్యారు. ఐపీఎల్ వాయిదా పడటంతో ప్రస్తుతం చర్చల కోసం యూఏఈ చేరుకున్నారు.