ఆసీస్ పర్యటన ప్రసారం చేయనున్న సోని

by Shyam |
ఆసీస్ పర్యటన ప్రసారం చేయనున్న సోని
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ అనంతరం టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అందుకోసం జంబో టీమ్ ఈ నెల 12న యూఏఈ నుంచి సిడ్నీకి బయలుదేరనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను ఇండియాలో సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, సోనీ సిక్స్‌ చానల్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఇండియా పర్యటనకు సంబంధించిన రూపొందించిన సరికొత్త ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నది.

Advertisement

Next Story