- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోను ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్.. ‘పాగల్ నహీ హోనా’
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ హీరో సోనూసూద్ ఫస్ట్ టైమ్ మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నారు. మల్టిపుల్ చార్ట్ బస్టర్స్‌తో ఇప్పటికే ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సింగర్ సునందా శర్మ మ్యూజిక్ సింగిల్ ‘పాగల్ నహీ హోనా’లో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. సునంద.. సోను లేడీ లవ్‌గా కనిపిస్తుండగా, అవ్వి శ్రా కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ట్రాక్‌కు జానీ లిరిక్స్ అందించారు. జనవరి 15న రిలీజ్ కానున్న ఈ మ్యూజిక్ సింగిల్‌ను మ్యాడ్ ఫర్ మ్యూజిక్ (Mad 4 Music) నిర్మించింది.
కాగా ఈ సాంగ్ తన హార్ట్‌కు చాలా దగ్గరైందన్నారు సునంద. ప్రతీ ఒక్కరి హృదయాలను భావోగ్వేగాలతో నింపుతుందని తెలిపారు. క్రియేటివ్ మైండ్స్ జానీ, అవ్వితో కొలాబరేట్ అవడం ఆనందంగా ఉందన్న సునంద.. నేషన్ హీరో సోనూసూద్ ఈ సాంగ్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారని, ఈ ప్రాజెక్ట్ చేసినందుకు థాంక్స్ చెప్పింది. ఈ విషయం గురించి మాట్లాడిన సోను.. తన ఫస్ట్ మ్యూజిక్ వీడియో ‘పాగల్ నహీ హోనా’ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. సాంగ్ కాన్సెప్ట్ విన్నాక వెంటనే ఓకే చెప్పానన్న సోను.. ఆర్మీ ఆఫీసర్స్, వారి లేడీ లవ్‌కు పాటను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.
— sonu sood (@SonuSood) January 11, 2021