ట్రోల్స్‌పై సోనూసూద్ రిప్లయ్..

by Shyam |
ట్రోల్స్‌పై సోనూసూద్ రిప్లయ్..
X

దిశ, వెబ్‌డెస్క్:
సోనూసూద్.. రియల్ హీరోగా కీర్తించబడ్డాడు, వలస కార్మికుల దేవుడిగా కొలవబడ్డాడు. లాక్‌డౌన్ సమయంలో ఏ హీరో, ఏ పొలిటీషియన్, ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయలేని సహాయం చేసి.. నిజమైన లీడర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అంతకు మించి బంగారం లాంటి మనసున్న మంచి అన్నగా, బిడ్డగా ఆప్తులను సంపాదించుకున్నాడు. కానీ కొందరికి మంచి కూడా చెడులాగా.. పుణ్యం కూడా పాపం లాగే కనిపిస్తుంది. మంచి చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని ఎలా చెడుగా చిత్రీకరించాలి.. ఎలా ఆ గౌరవాన్ని నాశనం చేయాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. సోనూ సూద్ విషయంలోనూ అలాగే జరుగుతోంది. తను చేసిన మంచి పనులను ఫ్రాడ్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి వారికి ఓ ఇంటర్వ్యూలో సరైన సమాధానం ఇచ్చాడు సోను. ఒకరిని చెడుగా చిత్రీకరించడం అనేది కొందరి వృత్తి అని.. అలాంటి వాళ్లను తాను పట్టించుకోనని తన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపాడు. తనను ఫ్రాడ్ అంటున్న వాళ్లకు సమాధానం చెప్పి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు తన సహాయం పొందిన 7, 03, 246 మంది డేటా బేస్ తన దగ్గర ఉందని చెప్పాడు. పొలిటికల్ ఎంట్రీ కోసం ఇదంతా చేస్తున్నానని మరికొందరు అనుకున్నా.. రాజకీయాలు అసలు తనకు ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మాత్రం 100 శాతం ప్రజల కోసమే పని చేస్తానని.. ఎలాంటి సమస్య రాకుండా, లేకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు సోను. ఇలాంటి చర్చలు చేస్తూ.. ఇతరులను కామెంట్ చేయడం కాకుండా వీలైతే కష్టాల్లో ఉన్నవారికి కొంచెం హెల్ప్ చేయాలని కోరాడు.

Advertisement

Next Story

Most Viewed