నిజమైన నాయకుడు కేసీఆర్ : సోనూ సూద్

by Shyam |
నిజమైన నాయకుడు కేసీఆర్ : సోనూ సూద్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు సోనుసూద్…’అరుంధతి’లో పశుపతిగా నటించి విలనిజానికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ‘అమ్మ బొమ్మాళి’ అంటూ ప్రేక్షకులను భయపెట్టిన సోనూ సూద్… ఆ తర్వాత ఏక్ నిరంజన్, కందిరీగ, జులాయి లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సమయంలో ఎవరి ఇంట్లో వారే ఉండాలని.. బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు తెలంగాణలోనే చిక్కుకుపోయి… ఇళ్లకు చేరలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. మీరు మాకు బంధువులని.. ఎలాంటి భయం లేకుండా ఇక్కడే ఉండొచ్చని తెలిపారు. మా రాష్ట్రంలో సేవ చేసేందుకు వచ్చిన మీకు … బియ్యం, గోధుమపిండి రేషన్‌తో పాటు ఒక్కొక్కరికి రూ. 500 చెల్లిస్తామని ప్రకటించారు.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటామని ప్రెస్ మీట్‌లో తెలిపారు.

ఈ వీడియోను షేర్ చేసిన సోను సూద్.. నిజమైన నాయకుడు.. సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ… నిజంగా కేసీఆర్ ట్రూ లీడర్ అంటూ ప్రశంసిస్తున్నారు. బయట నుంచి వచ్చిన కూలీలను లోపలికి రానివ్వకుండా ఇతర రాష్ట్రాలు అడ్డుకుంటున్న తరుణంలో… ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల సంక్షేమ బాధ్యత నాదే అని ప్రకటించడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు. సోనూ భాయి ఈ విషయాన్ని నేషనల్ మీడియాకు కూడా చూపించి కళ్లు తెరిపించండి అంటున్నారు.

Tags : Sonu Sood, KCR, Telangana CM, Migrants, CoronaVirus, Covid19

Advertisement

Next Story