- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంతచెప్పినా తక్కువే.. ఓ సేవకుడా.. నీకు వందనం
దిశ, వెబ్‌డెస్క్: అభాగ్యులు, అనాథలకు వరాలిచ్చే దేవుడు సోనూసూద్. సోషల్ మీడియా పాలిట స్వచ్ఛంద సేవకుడు. ఆపదలో ఉన్న వారు గుడిలో దేవుడి కంటే ఎక్కువ సోషల్ మీడియాలో సోనూకే దండం పెడుతున్నారనడంలో సందేహం లేదు. తన వద్దకు వచ్చిన వారికి కాదనుకుండా అడిగినవాన్నీ ఇచ్చేస్తూ ఎంతమందికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోలను మించి నిజమైన బాధితులను ఆదుకుంటున్నాడు.
https://twitter.com/SonuSood/status/1324001934160715779?s=20
ఈ నేపథ్యంలోనే తన సేవాగుణాన్ని మరోసారి చాటాడు. తాజాగా జార్ఖండ్‌కు చెందిన అంజలి కుమారి అనే బాలిక అనుకోని పరిస్థితుల్లో యాసిడ్ తాగేసింది. దీంతో బోకారో స్టీల్ సిటీలోని నీలమ్ హాస్పిటల్‌లో చేరింది. అయినప్పటికీ పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. కాగా, అంజలి తండ్రి నిస్సహాస్థితిలో ఉండగా.. తల్లి మరణించింది. ఇక అంజలీ బాధను గ్రహించిన ఓ నెటిజన్ ఆమె ఫోటో ఆస్పత్రి, చికిత్స వివరాలను సోనూ సూద్‌కు పంపాడు. బాధితురాలి గోడు వివరించి కాపాడామని వేడుకున్నాడు.
ఈ ట్వీట్ చేసిన అరగంటలోనే స్పందించిన సోనూ రేపే చికిత్సకు ఏర్పాటు చేసినట్టు ఒక మేసేజ్ పెట్టారు. ‘చింతించకండి, రేపు అంజలి శస్త్రచికిత్స పరిష్కరించబడింది. డాక్టర్ మనోజ్ కే.ఆర్ శ్రీవత్సవ పర్యవేక్షణలో అంజలి చికిత్స రేపు ప్రారంభమవుతుంది. దేవుడు కోరుకుంటే, ఆమె త్వరలోనే తన కుటుంబంతో తిరిగి వస్తుంది..ఇలాజ్ ఇండియా’ అంటూ ట్వీట్ చేశారు.