శివ శంకర్ మాస్టర్‌ కోసం రంగంలోకి సోనూసూద్

by Shyam |
శివ శంకర్ మాస్టర్‌ కోసం రంగంలోకి సోనూసూద్
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ అవార్డు గ్రహిత, కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని సమాచారం. తాజాగా శంకర్ మాస్టర్ వైద్యం కోసం రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగాడు. తన శక్తిమేరకు సహాయం చేస్తానని సోనూసూద్ తెలిపాడు. అయితే శంకర్ మాస్టర్ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను ట్రేడ్ నిపుణులు వంశీ కాక షేర్ చేశారు. అంతేకాకుండా మాస్టర్‌కు మెరుగైన వైద్యం అవసరం. వైద్యం మరీ ఖరీదు కావడంతో ఆయన కుటుంబం ప్రస్తుతం ఇబ్బంది పడుతుంది. అని శంకర్ మాస్టర్ కుమారుడి డీటైల్స్ పెట్టారు. దీనిపై స్పందించిన సోను సూద్ తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మాస్టర్ కుటుంబంతో టచ్‌లో ఉన్నానని, తన శక్తిమేరకు సహాయం చేస్తానని సోనూ తెలిపాడు. అయితే మాస్టర్‌ ఉపిరితిత్తులు చాలా వరకు కరోనా కారణంగా ఇన్ఫెక్ట్ అయ్యాయని వైద్యులు ధృవీకరించారు. అంతేకాకుండా ఆయనతో పాటు అతని భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారని, వారిని ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు చూసుకుంటున్నాడని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed