సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

by Sridhar Babu |
సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
X

దిశ, నల్లగొండ: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలిపించుకొని ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ గురువారం తన నివాసంలో తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‌ని పిలిపించుకొని సోనియాగాంధీ చర్చించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ చతికిల పడడానికి గల కారణాల గురించి సోనియాగాంధీ ఆరా తీసినట్టు సమాచారం. సరైన నాయకత్వం లేకపోవడం నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతోనే కాంగ్రెస్ ప్రజాదారణ కోల్పోతుందని దీనిని కేసీఆర్ క్యాచ్ చేసుకున్నాడని కోమటిరెడ్డి సోనియాకు వివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్న కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు సమర్ధుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరినట్టు తెలిసింది. తనకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని సోనియా గాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వివరించినట్టు సమాచారం. అదే విధంగా కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన అభియోగంపై ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని వెంకటరెడ్డి అధినేత్రికి వివరించినట్టు సమాచారం. ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోవడంతో కార్యకర్తలకు మనోధైర్యం దెబ్బతిన్నదని నివేదించారు.

tags : sonia gandhi, mp komatireddy, meeting, delhi, pcc president, ktr farmhouse

Advertisement

Next Story

Most Viewed