విద్యార్థుల మనోగతం తెలుసుకోండి: సోనియా గాంధీ

by Shamantha N |
విద్యార్థుల మనోగతం తెలుసుకోండి: సోనియా గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ-నీట్ పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ అంశంపై స్పందించారు. పరీక్షల వాయిదాకే ఆమె కూడా మొగ్గుచూపారు. ఈ మేరకు సోనియా ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ ప్రియ‌మైన విద్యార్థులారా.. ప్రస్తుత మీ స్థితిని, బాధ‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఇప్పుడు మీరు అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప‌రీక్ష‌ల విషయంలో మీకు మాత్ర‌మే కాదు, మీ కుటుంబానికి ప్ర‌ధాన‌ స‌మ‌స్య‌గా మారింది. మీరే రేప‌టి భావి భారత నిర్మాతలు. కాబట్టి మీ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఏ అంశంపైనైనా మీ అనుమ‌తితోనే తీసుకోవాలి. కేంద్ర ప్ర‌భుత్వం కూడా మీ మొర ఆల‌కిస్తుంద‌ని ఆశిస్తున్నా. ఇదే ప్ర‌భుత్వానికి నేనిచ్చే స‌ల‌హా. ధ‌న్య‌వాదాలు” అని వీడియోలో సోనియా గాంధీ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story