AP News:‘మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్థం కావట్లేదు’.. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్థం కావట్లేదు’.. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) పై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Former Minister Buggana Rajendranath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల హోంమంత్రి అనిత(Home Minister Anitha), పోలీసుల పనితీరును ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపై నేడు(మంగళవారం) వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మీరు మంత్రి మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి కూడా. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో మీరు కీలక వ్యక్తి అంటే ప్రభుత్వంలో భాగం అన్నారు. ఈ రోజు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారా? ఎవరిని ప్రశ్నిస్తున్నారో మాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Advertisement

Next Story