మ‌ణికొండ పుప్పాల‌గూడ‌లో స‌మ‌స్య‌ల విల‌య‌తాండ‌వం

by Aamani |
మ‌ణికొండ పుప్పాల‌గూడ‌లో స‌మ‌స్య‌ల విల‌య‌తాండ‌వం
X

దిశ, గండిపేట్ : మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని పుప్పాల‌గూడ‌లో స‌మ‌స్య‌లు విల‌య‌తాండ‌వం చేస్తున్నాయ‌ని మణికొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్ల అన్నారు. మున్సిపాలిటీలో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం భారత రాష్ట్ర సమితి మణికొండ సీనియర్ నాయకులు గుట్టమీది నరేందర్, గోరుకంటి విఠల్, మల్లేశ్, ప్రకాశ్ ల ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రజాభిప్రాయ సేకరణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అందులో భాగంగా మణికొండ మున్సిపల్ ప‌రిధిలోని పుప్పాలగూడలో గుంత‌ల‌మ‌య‌మైన రోడ్లు, విద్యుత్ సరఫరా స‌మ‌స్య‌లు, మంచినీటి సరఫరా, మురుగు నీటి డ్రైనేజీ పారుదల సమస్యలతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు.

గ‌త 2019 లో రూ.45 ల‌క్ష‌ల బ‌డ్జెట్ తో డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ పేరున పుప్పాల‌గూడ వార్డు కార్యాల‌యం స్థ‌లంలో భ‌వ‌నం క‌ట్ట‌డానికి శిలాఫ‌ల‌కం వేసిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌నులు కాలేద‌న్నారు. కానీ ఆ బడ్జెట్ ఏ వైపునకు దారి మళ్లిందో అధికారులు చెప్పాల‌న్నారు. పుప్పాల‌గూడ‌లో ఏర్పాటు చేసిన బ‌స్తీ ద‌వాఖానా అస‌లు ప‌ని చేయ‌డం లేద‌న్నారు. ఎప్పుడు చూసినా ముసే వుంటుందని ప్ర‌జ‌లు తెలుపుతున్నార‌ని మండిప‌డ్డారు. దీంతో పాటు తాతల నాటి కాలం నుంచి పుప్పాలగూడ గ్రామ పంచాయతీ ఏలుబడి వరకు స్మశాన వాటికకు నరసింహ స్వామి దేవాలయంను ఆనుకొని బండ్ల దారి ద్వారా వెళ్ళే వారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ రహదారిని మూసివేసి ఆ ప్రక్కన వున్న ప్ర‌భుత్వ స్థలాలను ఆక్రమించుకొని పక్కా ఇండ్ల కట్టడాలను కట్టడి చేయలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులున్నారని స్థానిక ప్రజలు తెలుపుతున్నార‌న్నారు.

కావున సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవనాన్ని వెంటనే నిర్మించాలని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్మశాన వాటికకు వెళ్లడానికి ప్ర‌జ‌ల‌కు వీలు కల్పించి స‌రైన రహదారిని వేయాలని మున్సిపల్ క‌మిష‌న‌ర్ కు విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. లేని పక్షంలో ప్రజల సహకారంతో బీఆర్ ఎస్ పార్టీ తరపున ధర్నా చేపట్టి తమ నిరసనను తెలియ‌జేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ల ధనరాజ్, కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, బొమ్మూ ఉపేంద్రనాథ్ రెడ్డి, శ్రీ బాబు, సంతోష్, రమేష్, అశోక్, సుమన్, మహేందర్, యాలాల కిరణ్, రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, దిలీప్, షేక్ ఆరిఫ్, భాను చందర్, సయ్యద్ రఫిక్, కె.ప్రవీణ్, ఎల్ల స్వామి, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed