- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Women Commission : మహిళా ఏఈఓలకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ భరోసా
దిశ, డైనమిక్ బ్యూరో: Telangana Women Commission తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద Nerella Sharada తో మహిళా అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ భేటీ అయ్యారు. డిజిటల్ క్రాప్ సర్వేలో ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ నేరెళ్ళ శారద దృష్టికి మహిళా ఏఈఓలు తీసుకొచ్చారు. మహిళా ఏఈఓలకు అండగా ఉండాలంటూ చైర్మన్‌కు తాజాగా వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేరెళ్ళ శారద భరోసా ఇచ్చారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Digital Crop Survey డిజిటల్ క్రాప్ సర్వేను తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సర్వే అమలుపరిచే ప్రక్రియలో కలిగే ఇబ్బందులపై గత కొన్ని రోజుల నుంచి AEOs ఏఈఓలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఏఈఓలుగా మహిళలు ఎక్కువగా ఉండటంతో వారి భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని గత నిరసనల సమయంలో మహిళా ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు.