MandaKrishna Madiga : సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ

by M.Rajitha |
MandaKrishna Madiga : సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Nayudu)ను మంగళవారం ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(MandaKrishna Madiga) కలిశారు. చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయిన మంద కృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణను వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేకంగా విన్నవించారు. ఏపీలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడును కలిసి 32 అంశాలపై ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్గీకరణతో సహ వివిధ అంశాలపై గంటపాటు ఇరువురు చర్చించుకున్నారు. కాగా వీరి ఇరువురి సమావేశం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story