జగమే తంత్రంలో ‘బుజ్జి’కి నో ప్లేస్

by Shyam |
జగమే తంత్రంలో ‘బుజ్జి’కి నో ప్లేస్
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్‌ ప్లే చేసిన చిత్రం ‘జగమే తంత్రం’. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీలో హాలీవుడ్ యాక్టర్ జేమ్స్ కామ్సో నటిస్తుండగా.. జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఇక పాండమిక్ సిచ్యువేషన్ కారణంగా సోమవారం సాయంత్రం వర్చువల్‌గా జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో, కంపోజర్ సంతోష్ నారాయణన్‌‌తో పాటు ఇతర మ్యూజిషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ ఫైనల్ వెర్షన్ నుంచి హిట్ సాంగ్ ‘బుజ్జి’ని తొలగిస్తున్నట్టు కార్తీక్ సుబ్బరాజు రివీల్ చేశారు. సినిమా నిడివి దృష్ట్యా థియేట్రికల్ వెర్షన్‌లోనూ ఈ సాంగ్ ఉండబోదని స్పష్టం చేశారు.

మిగతా పాటలతో సినిమాను థియేటర్స్‌లో చూసినపుడు సెట్ అయ్యే అవకాశం ఉన్నా, నెట్‌ఫ్లిక్స్‌లో సింగిల్‌గా బ్రేక్ లేకుండా చూస్తున్నప్పుడు మాత్రం స్టోరీ నెరేషన్‌‌పై ప్రభావం చూపే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ నుంచి 3 పాటలు తొలగిస్తున్నట్టు వెల్లడించారు. కాగా పాటలు తగ్గించినప్పటికీ సినిమా చూసిన ఆడియన్స్‌ తప్పకుండా శాటిఫై అవుతారని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story