- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫరెవర్ వాల్‌పేపర్ నువ్వే సోనమ్!’.. హజ్బెండ్ బర్త్‌డే విషెస్
దిశ, సినిమా: బర్త్ డే గర్ల్ సోనమ్ కపూర్ బెస్ట్ విషెస్ అందుకుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తగా.. భర్త ఆనంద్ ఆహుజా, తండ్రి అనిల్ కపూర్ నుంచి వచ్చిన స్పెషల్ విషెస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా స్పెషల్ పిక్చర్ షేర్ చేసిన ఆనంద్.. భార్య సోనమ్‌ను ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరించాడు. తన మొబైల్ ఫోన్ వాల్ పేపర్ షేర్ చేసిన ఆనంద్.. ‘ నీకు వాల్‌పేపర్స్ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకు కావాల్సిన ఒకే ఒక్క వాల్‌పేపర్ నువు మాత్రమే. హ్యాపీ బర్త్ డే మై ఫరెవర్ వాల్‌పేపర్’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక తండ్రి అనిల్ కపూర్ కూతురు సోనమ్‌కు ఆత్మీయ శుభాకాంక్షలు అందించారు. తన హృదయాన్ని అనుసరిస్తూ, తన డ్రీమ్స్ చేంజ్ చేసే గర్ల్‌కు హ్యాపీ బర్త్‌డే అని తెలిపిన కపూర్.. బిడ్డ ఎదగడం చూస్తుంటే తండ్రిగా తన కల నిజమైనట్లుగా ఉందని చెప్పాడు. తాను కచ్ఛితంగా ఉత్తమ పిల్లలను కలిగిన అదృష్టవంతుడనని మురిసిపోయిన ఆయన.. సోనమ్ అవసరమైనప్పుడు బలంగా ఉంటుందని, ఇతరుల పట్ల దయతో వ్యవహరిస్తుందని చెప్పాడు. ప్రతీ విషయంలో చొచ్చుకుపోయే తత్వం.. తనకు ఇష్టమైన వాటిలో ఒకటని తెలిపాడు. ‘బేటా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, మిస్ అవుతున్నాను’ అని పోస్ట్ పెట్టాడు.