- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూటా ముల్లె సర్దేసిన.. సోనమ్
సోనమ్ కపూర్‌కు ట్రావెలింగ్ అన్నా.. అమ్మానాన్నలతో గడపడమన్నా చాలా ఇష్టం. కానీ కరోనా లాక్‌డైన్ వల్ల తను ఆ రెండింటికీ దూరమైంది. ఇండియాలో కరోనా అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నగరాల్లో ముంబై ఒకటి. కరోనా కేసులు అక్కడ విజృంభిస్తున్నప్పటికీ.. రేపటి(సోమవారం) నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దాంతో ఎప్పటి నుంచో అమ్మనాన్నలను కలవాలనుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ సోనమ్.. ‘త్వరలోనే ఢిల్లీ నుంచి ముంబై రాబోతున్నాను. అల్రెడీ నా బ్యాగులన్నీ సర్దుకున్నాను. ఇప్పుడూ నేనెక్కడికి వెళ్లడానికైనా రెడీ.. ఐ మిస్ ట్రావెలింగ్’ అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. ఈ పోస్ట్‌కు జతగా.. గతంలో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఇటీవలే సోనమ్ వోగ్ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేరేంట్స్‌తో బర్త్‌డే జరుపుకోవాలనుందని తన మనసులో మాటను వెల్లడించింది. కాగా అనుకున్నట్లుగానే తన పుట్టినరోజు జూన్ 9 వరకు సోనమ్ తన పేరేంట్స్ వద్దకు చేరుకోనుంది. సో తన బర్త్‌డే రోజు.. తన ఇష్టమైన స్వీట్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోనుంది సోనమ్. లాక్‌డౌన్‌లో లండన్ నుంచి తిరిగొచ్చిన సోనమ్.. అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్న ఆమె భర్త ఆనంద్ ఆహూజాతోనే ఉంటోంది.