- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిని బెదిరించిన సోనాక్షి.. కారణమిదే!
దిశ, సినిమా : బాలీవుడ్ బబ్లీ గర్ల్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)తాను ఇండిపెండెంట్‌గా ఉండేందుకే ఇష్టపడతానని తెలిపింది. ప్రతీ విషయాన్ని నేర్చుకోవాలని, ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంటుందన్న సోనాక్షి.. తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగడం ఇష్టముండదని చెప్పింది. తండ్రి శతృఘ్న సిన్హా మినిస్టర్ అయ్యే సమయానికి తాను ఆరో తరగతి చదువుతున్నానని.. అప్పటి వరకు హ్యాపీగా స్కూల్‌కు వెళ్లే తనను జీప్ నిండా బాడీ గార్డ్స్ ఫాలో కావడం మొదలుపెట్టారని చెప్పింది. దీంతో స్కూల్‌లో హడావిడిగా ఉండేదని, అందరూ డిస్టర్బెన్స్ ఫీల్ అయినట్లు అనిపించేదని వెల్లడించింది. అయితే బాడీగార్డ్స్ తనను ఫాలో అయితే స్కూల్‌కు వెళ్లనని అమ్మతో చెప్పేశానని గుర్తుచేసుకుంది. కాలేజ్ టైమ్‌లో కూడా సెలబ్రిటీ కూతురుగా కాకుండా నార్మల్‌గా ఉండేందుకే ఇష్టపడ్డానని, ట్రైన్ జర్నీ చేస్తూ కాలేజ్‌కు వెళ్లేదాన్నని పేర్కొన్న సోనాక్షి.. చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండాలనుకున్న తాను అన్ని విషయాలు సొంతంగా నేర్చుకుని, ఒక వ్యక్తిగా ఎదగాలని కోరుకున్నానని చెప్పింది.