తల్లి మరణించిన కొద్దిసేపటికే కొడుకు మృతి

by Anukaran |
తల్లి మరణించిన కొద్దిసేపటికే కొడుకు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన కొద్దిసేపటికే ఆమె కొడుకు మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎస్.కోట గౌరీశంకర్ కాలనీలో కాసులమ్మ మహిళ శుక్రవారం మృతిచెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కొడుకు కూడా అదే ఇంట్లో మృతిచెందాడు. అయితే, కరోనా సోకి వారిద్దరూ మృతిచెంది ఉంటారన్న భయంతో ఎవరు కూడా ఆ ఇంటిలోకి వెళ్లడంలేదు. దీంతో వారి మృతదేహాలు ఆ ఇంట్లో రాత్రి నుంచి అక్కడే ఉన్నాయి.

Advertisement

Next Story