- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్‌ను పెళ్లి చేసుకునేందుకే ఇండియా వచ్చా
దిశ, సినిమా : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఏ వార్త వచ్చినా పాపులర్ అవుతూ ఉంటుంది. ఫలానా హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని.. త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడని చాలాసార్లు న్యూస్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. 55 ఏళ్లు వచ్చిన సల్మాన్ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఇందుకు కారణం తన షార్ట్ టెంపరే అని చాలా మంది అంటుంటారు.
కాగా పాకిస్తాన్‌కు చెందిన అమెరికన్ యాక్ట్రెస్ సోమీ అలీ కూడా సల్మాన్‌తో డేటింగ్ చేసిందని, పెళ్లి చేసుకోవడమే తరువాయి అని 90వ దశకంలో రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అలనాటి హీరోయిన్ తాజాగా స్పందించింది. ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూశాక సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడిపోయానని.. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని 16 ఏళ్ల వయస్సులో అమెరికా నుంచి ఇండియా వచ్చానని తెలిపింది. తనకు సినిమాల్లో నటించాలని ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదని, సల్మాన్‌ను పెళ్లి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా ఆలోచించేదాన్నని చెప్పింది. తను ఇండియా వెళ్లి సల్మాన్‌తో వివాహం చేసుకుంటానని చెప్తే తల్లిదండ్రులు నిరాకరించారని, కానీ తను రిక్వెస్ట్ చేస్తూనే ఉండేదని తెలిపింది. ఆ తర్వాత భారత్‌లో బంధువుల ఇంటికి వెళ్తాను, తాజ్ మహల్ చూస్తానని అబద్ధం చెప్పి ఇండియాకు వచ్చిన తను ఓ కాస్ట్‌లీ ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగానని తెలిపింది.
తనకు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చాన్స్ వచ్చినా కెరియర్ సరిగ్గా లేదని.. కారణం తను రిహార్సల్స్‌కు వెళ్లేందుకు నిరాకరించేదాన్నని చెప్పింది. ఇలా ప్రతీ దర్శకుడికి నైట్ మేర్‌గా మారిపోయానని తెలిపింది సోమీ అలీ. తను సినీ పరిశ్రమకు అన్‌ఫిట్ అని తెలుసని, ఆ టైమ్‌లో సల్మాన్ మాత్రమే తన టార్గెట్ అని చెప్పింది. కానీ ఇప్పుడు సల్మాన్‌తో టచ్‌లో లేనని, తన తల్లి సల్మా ఖాన్‌ను మాత్రం మియామి పర్యటనకు వచ్చిన సమయంలో కలిశానని చెప్పింది. కాగా సల్మాన్, సోమీ ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారని అప్పట్లో న్యూస్.