- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం సరిపడా టీకాలు అందించలేదు :సీఎస్ సోమేష్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినన్ని టీకాలు సరఫరా చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 44ఏళ్ల వారికి 1.72 కోట్ల టీకాలు అవసరమవుతుండగా మే నెలలో రాష్ట్రానికి కేవలం 4.4 లక్షల డోసులను మాత్రమే కేంద్ర కేటాయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శనివారం కొవిడ్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలని కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినట్టుగా తెలిపారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రెండవ డోస్ వేయడానికి 30.45 లక్షల డోస్ లు అవసరం కాగా, మే మొదటి వారానికి కేవలం 8.35 లక్షల డోస్ లను మాత్రమే కేంద్రం కేటాయించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ రోగులకు సేవలందిచేందుకు కాల్ సెంటర్ (040-21111111) ను ఏర్పాటు చేశామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నిమ్స్ లో 500, సరోజిని దేవిలో 200, ఛాతీ ఆసుపత్రి లో 50, గాంధీ లో 200, టిమ్స్‌లో 200 ల అదనపు పడకలను పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులున్న గోల్కొండలో 100, మలక్‌పేట్‌లో 100, వనస్థలిపురంలో 100, అమీర్‌పేటలో 50 కొవిడ్ పడకలను అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు కోవిడ్ లక్షణాలున్న వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 7.5 లక్షల కొవిడ్ మెడికల్ కిట్లకు అదనంగా మరో 5 లక్షల మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేపడుతామన్నారు. కోవిడ్ పాజిటివ్ రోగులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందచేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రస్తుతం 20వేల ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో రాష్ట్రంలో 18,232 కోవిడ్ పడకలు ఉండగా వీటిని 49,133 పడకలకు పెంచడం జరిగిందన్నారు. 60 వేల పడకల వరకు పెంచడానికి తగిన కార్యచరణ చేపడుతున్నామని చెప్పారు. కొవిడ్ పాజిటివ్ రోగులకు అవసరమైన సేవలను అందించుటకు అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పిహెచ్‌సీలో ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు భర్తీ చేపట్టాలని ఆదేశించామని తెలిపారు. రెమ్‌డెసివిర్ మందుల కొరత లేకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. కలెక్టర్లు జిల్లాలోని పెద్దాసుపత్రికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని ఇతర ఆసుపత్రులకు సీనియర్ జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉంటారని తెలిపారు. ప్రస్తుతం రోజుకు రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుండగా 430 మెట్రిక్ టన్నుల మత్రమే కేంద్రం కేటాయించిందని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, మున్సిపల్ పరిపాలన కమీషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ , మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, ఆరోగ్య శాఖ అడ్వైజర్ శ్రీ టి. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.