- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెయిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోమ మండల్!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) ఛైర్మన్‌గా సోమ మండల్ బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఈ పదవిలో ఉన్న అనిల్ కుమార్ నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుకున్నారు. సంస్థను లాభదాయకంగా కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని, కంపెనీ షేర్ హోల్డర్ల విలువలను మెరుగుపరిచేలా చూస్తూనే, సంస్థను నిర్మాణాత్మకమైన పటిష్ఠతను కాపాడతానని ఆమె స్పందించారు. సెయిల్ ఆర్థిక పనితీరును మెరుగుపరచడమే తన మొదటి లక్ష్యమని చెప్పారు. సోమ మండల్ ఇదివరకు సెయిల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా నుంచి డిగ్రీ చేసిన ఆమె, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) డైరెక్టర్‌గా చేశారు. అనంతరం 2017లో సెయిల్‌లో జాయిన్ అయ్యారు.
Advertisement
Next Story