- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వగ్రామాలకు వీర జవాన్ల పార్థివదేహాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహాద్దుల్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన తెలుగు రాష్ట్రాల జవాన్ల పార్థివదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జవాన్‌కు నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని కోమన్ పల్లి గ్రామానికి బుధవారం తెల్లవారుజామున మహేష్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థీవదేహాన్ని చూసి ఆయన భార్య, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఉదయం 10 గంంటలకు సైనిక లాంఛనాలతో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, తొలుత బోయిన్‌పల్లికి చేరుకున్న వీర జవాన్ మహేష్ మృతదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. మహేష్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం ప్రకటించారు.