- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే..‘భానుడి’ పిక్స్
దిశ, వెబ్ డెస్క్: మండే అగ్నిగోళంగా కనిపించే ‘సూర్యుడ్ని’ దగ్గరి నుంచి చూస్తే తట్టుకోవగలమా? నిస్సందేహంగా.. కోడి గ్రిల్ అయినట్లు.. మనం కూడా మలమల మాడిపోతాం. అయితే ఆ భగభగమండే భానుడ్ని దగ్గర నుంచి తీసిన ఫొటోలను మాత్రం చూసే అవకాశం వచ్చింది. సోలార్ ఆర్బిటర్ క్లిక్ మనిపించిన సూర్యుని అతి సమీపమైన ఫొటోలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతవరకు ఆ దరిదాపుల్లో సూర్యుడి ఫొటోలు చిక్కలేవు.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయక్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న సోలార్ ఆర్బిటర్‌ను అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అది నాలుగు నెలల తర్వాత సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో తీసిన చిత్రాలే ఇప్పుడు బయటకొచ్చాయి. వాటిని నాసా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను ఆర్బిటర్ మిషన్ 47, 845, 581 మైళ్ల దూరం నుంచి తీసింది. సూర్యుడికి సమీపంలో ఉన్న ఈ దూరాన్ని ‘పెరి హీలియన్’ అంటారు. ఫొటోల్లో కనిపించే స్మాల్ సోలార్ ఫ్లేర్స్ (సౌర కాంతులు)ను ‘కాంప్‌ఫైర్స్’ అంటారు. సన్ సర్ఫేస్‌కు అతి సమీపంలో వీటిని చూడగలం. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత దగ్గర సూర్యుని చిత్రాలు చూడలేదని శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ పేర్కొంటున్నారు. సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన ఈ చిత్రాలు, సూర్యుడిపై మరిన్ని అధ్యయనాలు చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అభిప్రయాపడ్డారు. తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. ఇంకా సూర్యుడికి సంబంధించిన ఎన్నో విషయాలను సోలార్ ఆర్బిటర్ భూమికి చేరవేస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ‘సూర్యుడి ఉపరితలం మీద.. చిన్న చిన్ని అగ్నిగోళాలు కనిపిస్తున్నాయి. ‘కరోనల్ హీటింగ్’ ప్రాసెస్‌లో వీటి పాత్ర ప్రధానం. సూర్యుడిలోని లోయర్ లేయర్స్‌తో పోల్చితే.. కరోనా(సన్ .ఔటర్ లేయర్) 200-500 టైమ్స్ ఎక్కువ వేడిగా ఉంటుంది. ’అని శాస్ర్తవేత్తలు వెల్లడించారు.