- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ డెయిరీల్లో సౌర విద్యుత్తు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నడెయిరీల్లో సౌర విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది డెయిరీలు, పదకొండు చిల్లింగ్ సెంటర్లను సంస్థ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యుత్ ఛార్జీల కోసం ప్రతి నెలా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని గుర్తించారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడానికి అన్నిడెయిరీల్లో సౌర విద్యుత్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. బోర్డు నిర్ణయానికి అనుగుణంగా పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర సమక్షంలో విజయ తెలంగాణ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, టీఎస్ రెడ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ నీలం జానయ్య ఒప్పంద పత్రాలపై గురువారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రధాన డెయిరీలతో పాటు జిల్లాల్లోని ఎనిమిది డెయిరీలు, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్ ప్లాంట్లను టీఎస్ రెడ్‌కో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌ల మొత్తం సామర్ధ్యం 1930కేవీగా అధికారులు వివరించారు.