శ్రీకాళహస్తి మినహా గుళ్లన్నీ మూత.. ఎప్పుడంటే

by srinivas |
శ్రీకాళహస్తి మినహా గుళ్లన్నీ మూత.. ఎప్పుడంటే
X

దిశ, ఏపీ బ్యూరో: ఆదివారం శ్రీకాళహస్తీశ్వరాలయం తప్ప ఆంధ్రప్రదేశ్‌లోని గుళ్లన్నీ మూతపడనున్నాయి. ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ ఏర్పడుతుంది. దీని ప్రభావం వృషభ, మిధున రాశులతో పాటు జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1,2,3 పాదాల వారిపై తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

అందుకే శనివారం రాత్రి పూజల అనంతరం దేవాలయాలకు తాళాలు వేయనున్నారు. సంప్రోక్షణ అనంతరం అంటే సోమవారం తిరిగి దేవాలయాలను భక్తుల కోసం తెరవనున్నారు. పైన చెప్పిన రాశులు, నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ సూర్య గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గ్రహణం సమయంలో ఏమీ తినకుండా ఉండాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు, అభిషేకాలు యధావిధిగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం దేవాలయాలు మాత్రం మూసుకోనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed