బలవన్మరణం చేసుకున్న కుటుంబం..  క్రెడిట్ కార్డు, హౌసింగ్ లోన్లే కారణమా..

by Shyam |
బలవన్మరణం చేసుకున్న కుటుంబం..  క్రెడిట్ కార్డు, హౌసింగ్ లోన్లే కారణమా..
X

దిశ, పటాన్‌చెరు: రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్ఈఎల్ న్యూ ఎంఐజీలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చంద్రకాంత్, అతని భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు బలవన్మరణం చేసుకున్నారు. ఈ ఉదంతం చూసిన వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్న చంద్రకాంత్​ వేలల్లో సంపాదిస్తున్నా ఆర్థిక సమస్యల్లో ఎలా చిక్కుకున్నారన్న అనుమానం అందరికీ వచ్చింది. స్నేహితులు, కొంతమంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా కట్టిన ఇంటికి చంద్రకాంత్ లక్షల్లో లోను తీసుకున్నాడని, వచ్చే జీతం మొత్తం లోను కట్టడానికే సరిపోయేదని తెలిసింది.

చేసేది లేక కుటుంబ పోషణ కోసం క్రెడిట్ కార్డులపై లోన్లు తీసుకున్నాడని, అవి కట్టలేక గత కొన్ని నెలలుగా ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కున్నాడని తెలిపారు. లోన్లు కట్టే విషయంలో కంపెనీల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇంట్లో భార్యతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్రంగా మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబమంతా తనవులు చాలించడం చూసి చుట్టుపక్కల వారు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed