పాతబస్తీలో సోషల్​ వర్కర్​ సఫియా బేగం గ్యాంగ్​ హల్​చల్​

by Sumithra |   ( Updated:2023-03-20 18:52:20.0  )
పాతబస్తీలో సోషల్​ వర్కర్​ సఫియా బేగం గ్యాంగ్​ హల్​చల్​
X

దిశ, చార్మినార్: ఆమె ఒక సోషల్​ వర్కర్​ .. అర్థరాత్రి ఎంఐఎం నాయకులతో కలిసి పాతబస్తీలో హల్​ చేసింది. ముస్లింల సంప్రదాయానికి మాయని మచ్చ తెస్తున్నారని, అప్రతిష్ఠపాలు చేస్తున్నారని రోడ్డు మీద భిక్షాటనం చేసుకునేవాళ్లతో పాటు రాకపోకలు సాగించే వారిని అడ్డుకుంది. ఆ మహిళ తాను బురఖా ధరించకుండా, కనీసం మాస్క్​ లేకుండా బురఖా ధరించిన వాళ్లను అసలు మీరు ముస్లింలేనా … అంటూ బురఖా ధరించిన ముస్లిం మహిళల బురఖాలను లాగింది. మీరు హిందువులు అంటు ముస్లిం బురఖాలను ఎందుకు ధరించి ముస్లిం మతాన్ని కించపరుస్తున్నారని రెచ్చిపోయింది. చట్టాన్ని చేతులోకి తీసుకుంది. భార్యభర్తలలిరువురి చెంపలపై చెల్లుమనిపించింది… మేము ముస్లింలమని ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు.. జరిగిన తతంగమంతా వీడియో రికార్డింగ్​ చేస్తూ సోషల్​ మీడియాలో వైరల్​ చేసింది. ఈ ఘటన పాతబస్తీతో పాటు నగర శివార్లలో తీవ్ర కలకలం రేపింది. అవమానం భరించలేక ముస్లిం దంపతులు సోషల్​ వర్కర్​పై పహాడిషరీఫ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పహాడి షరీఫ్​లో భార్యాభర్తలపై దాడి..

పహాడిషరీఫ్​ కమాన్​ వద్ద కల్లు కంపౌండ్​లోంచి బయటికి కల్లు పార్శల్​ తీసుకువస్తున్న బురఖా ధరించిన మహమూద్ బేగంను సోషల్​ వర్కర్​, ఎన్​జీఓ నారీనికేతన్​ అధ్యక్షురాలు సఫియా, ఎంఐఎం నాయకులు మహ్మద్​హైదర్​ మహ్మద్​లతో గురువారం రాత్రి అడ్డగించింది. ఎక్కడి నుంచి వస్తున్నావ్​ … అంటూ చేతిలోని సంచిని లాక్కుని చూసింది. బురఖాధరించి కల్లు కంపౌండ్​లోకి ఎలా వెళుతావ్​ ? నీ ఇల్లు ఎక్కడ ? నవ్వు ముస్లింవేనా అంటూ ప్రశ్నలతో సంధించింది. పక్కనే ఉన్న ఆమెభర్త జహంగీర్​ను సిగ్గులేదా? పెళ్లాంను కంపౌండ్​కు పంపించి కల్లు తెప్పించుకుంటావా? అంటూ జహంగీర్​ చెంపలపైన కొట్టింది. నువ్వు ఇంకోసారి బురఖాపై పోతవా అంటూ దుర్భాషలాడుతూ నగ్నంగా వెళ్లి చేసుకో బురఖా ధరంచి ఇస్లాం మతాన్ని కించపరచొద్దని హెచ్చరించింది.

మహిళ బురఖా లాగిన సోషల్ వర్కర్…

ఇంట్లో కూతురు పరస్థితి విషమంగా ఉందని ఆమె ఫొటోతో ఇంకొక కూతురుతో రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఓ మహళను కూడా సోషల్​ వర్కర్​ గ్యాంగ్ ​అడ్డగించింది. నువ్వు ఎక్కడ ఉంటావ్​ నీ బిడ్డ ఎక్కడ ఉందో పోదాం పా ? ఇవ్వన్నీ తమాషాలు ఎందుకు చేస్తున్నావ్​ వయస్సుకు వచ్చిన కూతుళ్లతో చేస్తున్న పనేంటి అని ? నిలదీసింది. నా కూతురు ఆరోగ్యం బాగాలేదు నేను షాహిన్​నగర్​లో ఉంటాను అని చెబుతున్నా బురఖా తీయ్​ నీ అసలు రంగు బయటపడుదని బురఖాను లాగింది. మేము ఇక్కడి నుంచి వెళ్లి పోతాం .. అసలు ఇక్కడికి మళ్లీ రాలేమని చెప్పినా వినకుండా దుర్భాషలాడింది. ఇంకోసారి రోడ్ల మీద కనిపిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించింది.

భిక్షాటన పేరుతో దాందాలేంటి ?

ఖాద్రీచమాన్​ దర్గా రోడ్డులో వయసుకు వచ్చిన తన కూతురుతో కలిసి రోడ్డుపై భిక్షాటనం చేస్తున్న మహిళను అడ్డగించారు సోషల్​ వర్కర్​ గ్యాంగ్​.. ఇదేం పద్దతి?ఎందుకు కూర్చున్నావ్? బురఖా ధరించి ఎవరి సంప్రదాయాన్ని మట్టిలో కలుపుతున్నావ్​ అని కన్నెర చేసింది. నీ దగ్గర లేకుంటే పని చేసి బతుకు .. బురఖా ధరించి అడుక్కోవడమేంటని ప్రశ్నించింది.. నీలాంటి వాళ్లతోనే ముస్లిం ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను చాలా మందిని చూశా భిక్షాటనం పేరుతో వేరే దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నా దగ్గర ఒక యదార్థ ఘటన కూడా ఉందని, తాను పేర్లు చెప్పలేనని స్పష్టం చేసింది. ఈ ఘటనపై కొంత మంది ముస్లిం వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి. సోషల్​ వర్కర్​ అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేంటని ? అసలు ఆమె బురఖా ధరించకుండా రోడ్లపై అందరిముందు బురఖా తొలగించడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed