గ్రాండ్ D/o టాలీవుడ్ … ‘సోషల్ అల్లరి’

by  |
గ్రాండ్ D/o టాలీవుడ్ … ‘సోషల్ అల్లరి’
X

దిశ, వెబ్‌డెస్క్‌: సినీ ఇండస్ట్రీలో వారసత్వం కామన్. తండ్రి హీరో అయితే కొడుకు స్టార్ హీరో కావడం సర్వ సాధారణం. 20 ఏళ్ల వయస్సు వచ్చే వరకు తనయుడిని విదేశాల్లో యాక్టింగ్‌ కోర్సు చేయించి … పర్‌పెక్ట్‌ అనే నమ్మకం వచ్చాక.. మంచి డైరెక్టర్ చేతుల్లో పెట్టేసి లాంచ్ చేసేస్తారు. టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మెగా హీరోలు ఇలా వచ్చినవారే. విశేషమైన అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హోదాను పొందుతున్నవారే. ప్రేక్షకుల అమితమైన ప్రేమ, ఆదరణ సొంతం చేసుకున్నవారే.

కానీ, కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అప్‌డేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 20 ఏళ్ల వయస్సు వరకు వారసులను పరిచయం చేసేందుకు ఆగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఉంది కదా.. ఇలా ఒక్క వీడియో తీసి.. అలా పోస్ట్ చేస్తే చాలు… ఎన్ని లైకులు.. ఎన్ని కామెంట్స్ .. ఎన్ని కాంప్లిమెంట్స్. అందుకే హీరోలు, నిర్మాతల పిల్లలు ఇండస్ట్రీలో బిజీగా ఉంటే… మనవరాళ్లు, మనవలు తమ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇందులో ఫస్ట్ ప్లేస్ అల్లు అరవింద్ మనవరాలు అర్హకి ఇవ్వడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. తండ్రి అల్లు అర్జున్‌తో కలిసి ఏ అల్లరి చేసినా సరే… ఆ వీడియో ఇట్టే అప్‌లోడ్ అయిపోతుంది. ఆ ముద్దు ముద్దు మాటలు, ఫాదర్ డాటర్ లవ్‌తో నిండిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. గురువారం ఈ బుజ్జి మనవరాలు హీరో నిఖిల్ నటిస్తున్న ’18 పేజెస్’ సినిమాకు చీఫ్ గెస్ట్‌గా వెళ్లింది కూడా. అక్కడ తాతను ముద్దు చేసిన వీడియో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో వైరల్ కాగా… ఈ కాలం తాతలందరూ నాకు అలాంటి మనవరాలు ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు సితార ఏకంగా యూట్యూబ్‌లో వీడియో ఛానల్‌నే నడిపిస్తోంది. ఇంత చిన్న వయస్సులోనే తండ్రి మహేష్ బాబు సినిమాల గురించి కూడా ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. అంతే కాదు మహేష్ సినిమాలో హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసే సితార డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. సితార నుంచి వీడియో విడుదలైన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాలోని డాంగ్ డాంగ్ పాటపై స్టెప్పులేసిన సితార… తమన్నానే మరిపించిందనే కాంప్లిమెంట్స్ అందుకుంది.

సూపర్ స్టార్‌, స్టెలిష్ స్టార్ల కంటే మాకేం తక్కువనుకుందో ఏమో మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, శ్రీజ కూతురు నవిష్క. అందుకే పుట్టినప్పటి నుంచే సోషల్ మీడియాను అటెన్షన్ చేసింది. మెగా మనవరాలంటే మాటలా..? ఒక్క ఫోటోతోనే ఫుల్ పాపులర్ అయిపోయింది. నవిష్క అన్నప్రాసన వీడియోకు కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమెకు, ఆమె తాతయ్యకు ఉన్న క్రేజ్ అదుర్స్ అనిపిస్తుంది కదా. ఇప్పుడిప్పుడే పలుకుతున్న చిన్నారి నవిష్క.. వచ్చీ రాని మాటలతో ఏబీసీడీలు చెప్తున్న క్యూట్ వీడియోకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రలో కనిపించి శభాష్ అనిపించింది. ఆ పాత్రలో అల్లరి, నటనకు విమర్శకులను కూడా మెప్పించింది నిశంకర. మహానటి సినిమాతో కీర్తి సురేశ్‌కు ఎంత పేరు వచ్చిందో…. బుల్లి సావిత్రిగా అలరించిన నిశంకరుకు కూడా అంతే గొప్ప పేరు వచ్చింది.

Tags: Grand Daughtes, Super Stars, Social Media, Allu Arha, Sitara, Navishka, Nishankara


Next Story

Most Viewed