రూ.10 వేలకే లభిస్తున్న Realme సరికొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
రూ.10 వేలకే లభిస్తున్న Realme సరికొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Realme C65 5G’. ఇది శుక్రవారం లాంచ్ అయింది. ఫోన్ ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ అనే రెండు కలర్స్‌లలో లభిస్తుంది. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్ ఫీచర్‌లను కలిగి ఉంది. 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.10,499. 4GB RAM+ 128GB ధర రూ.11,499. 6GB RAM+ 128GB ధర రూ.12,499. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ రోజు నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో కస్టమర్లు SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లు లేదా EMI ఎంపికలపై తగ్గింపు పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా 6GB ర్యామ్ వేరియంట్‌పై రూ.1000 తగ్గింపును కూడా సొంతం చేసుకోవచ్చు.

Realme C65 5G స్పెసిఫికేషన్లు:

* 6.67-అంగుళాల HD+ (1,604 x 720 పిక్సెల్‌లు) డిస్‌ప్లే.

* 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 625 nits పీక్ బ్రైట్‌నెస్‌.

* MediaTek డైమెన్సిటీ 6300 ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0తో రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరాను అందించారు.

* 15W వైర్డు చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ అమర్చారు.

* దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది.



Next Story

Most Viewed