- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP elactions 2024 : ఏపీలో భారీగా నామినేషన్ల తిరస్కరణ..ఎందుకో తెలుసా..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. గురువారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో శుక్రవారం నుంచి నామినేషన్లను అధికారులు పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు. అయితే కొన్ని తప్పుల కారణంగా పలువురి నామినేషన్లను తిరస్కరించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 5 వేల 993 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకూ 580 నామినేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 283 నామినేషన్లను తిరస్కరించారు. 25 ఎంపీ స్థానాలకు గాను 11 వందల 3 నామినేషన్లు వేశారు. వీటిలో 64 నామినేషన్లు ఆమోదం పొందగా 18 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పలుచోట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్లు సరిగ్గా ఉన్నా అధికారులు నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే అధికారులు మాత్రం ఈసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం నమోదు చేయడంతో పలువురి నామినేషన్లను తిరస్కరించామని తెలిపారు. మిగిలిన నామినేషన్లను కూడా పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలో నిలుస్తోంది. అయితే అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలిన జరుగుతోంది. చివరి తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఆమోదం తెలిపిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు వ్యక్తమయితే అధికారుల నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఉంటుంది.
Read More..
BREAKING: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉంది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్