- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశం కోసం పుట్టాం.. దేశం కోసమే చస్తాం.. కిషన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ బాస్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందని.. ఐఎన్‌సీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని కాంగ్రెస్ భారతదేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని.. ఈ విషయంలో బీజేపీ ప్రతిఘటించడంతో ఆ పార్టీ వెనక్కి తగ్గిందన్నారు. మేం దేశం కోసం పుట్టాం.. దేశం కోసం చస్తాం.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇటలీ కోసం పుట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రాచారం చేస్తోందని.. ఆ పార్టీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందని ప్రశ్నించారు. కాశ్మీ్ర్‌లో కాంగ్రెస్ జిన్నా రాజ్యాంగం అమలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని అన్ని సమస్యలకు మూలకారణం కాంగ్రెస్ అని.. ఆ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం అని విమర్శలు గుప్పించారు.