హైదరాబాదు వాసులకు షాకింగ్ న్యూస్.. రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు

by Disha Web Desk 9 |
హైదరాబాదు వాసులకు షాకింగ్ న్యూస్.. రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదు వాసులకు ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. నేడు (ఏప్రిల్ 26) హైటెక్ సిటీలో ఓ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. కాగా నేడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల హడావిడి, ఐపీఎల్ కారణంగా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

ఈ మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్, సీఓడీ జంక్షన్, దుర్గం చెరువు, ఐలాబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ మీదుగా బయోడైవర్సిటీకి ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ఇక మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్, ఖానమేట్, కొత్తగూడ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్, ఏఐజీ హాస్పిటల్, ఐకీయా, దుర్గం చెరువు మీదుగా హైటెక్స్, సైబర్ టవర్స్ వైపు వెళ్లాలని వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమం జరిగే పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాలను తీసుకురావడం, పార్కింగ్ చేయకూడదని హెచ్చరించారు. తాత్కాలికంగా ట్రాఫిక్‌ను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed