Breaking: మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు

by Disha Web Desk 16 |
Breaking: మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒంగోలులోని ఆయన ఇంట్లో రెండు బాంబులు పెట్టామని అగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాదు ఇంటి ఎదుట లెటర్ కూడా పడేసి వెళ్లారు. ఇంట్లో బాంబులు, సీసీ కెమెరాలు పెట్టామని, అవి తీయాలంటే రూ.7 కోట్లు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు శిద్ధా రాఘవరావు ఫిర్యాదు చేశారు. స్థానిక సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఓ అగంతకుడు వచ్చి శిద్ధా రాఘవరావు ఇంటి ముందు లెటర్ పడేసి వెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కాగా ఏప్రిల్ 27న అర్ధరాత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించి వాచ్ మెన్ పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కిందపడేసి కొట్టారు. వాచ్ మెన్ పెద్దగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన మర్చిపోక ముందే బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది.

Next Story

Most Viewed