పదోన్నతులలో వివక్ష.. మహిళా సైనికాధికారుల పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Dishanational6 |
పదోన్నతులలో వివక్ష.. మహిళా సైనికాధికారుల పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా సైనికాధికులు దాఖలు చేసిన పిటిషన్ పై కీలక తీర్పు వెలవరించింది సుప్రీంకోర్టు. మహిళా ఆర్మీ అధికారులు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇది ధిక్కారణ కేసు కాదని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. ఉత్తర్వులో ఉల్లంఘన జరిగినట్లు ఎక్కడా లేదని పేర్కొంది.

మెరిట్ ని అంచనా వేసేందుకే అధికారులు ప్రమాణాలను పరిగణించారని పేర్కొంది. నవంబర్ 2023 నాటి తీర్పులో ప్రమాణాల విషయంలో కోర్టు ఊరుకోలేదని స్పష్టత ఇచ్చింది. పురుష అధికారుల పదోన్నతి కోసం అనుసరించిన ప్రమాణాలు ఏమిటో సూచిస్తూ అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించినట్లు గుర్తుచేసింది. పదోన్నతి విషయంలో ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్లు పేర్కొంది. ప్రమాణాలు లేకుండా ఎలా పదోన్నతి ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది కోర్టు.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం ద్వారా చట్టపరమైన పరిష్కారాన్ని పొందవచ్చని పిటిషనర్లకు సూచించింది కోర్టు. పిటిషనర్లను ఆర్మ్ డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించేందుకు అనుమతించింది.

ఆర్మీ అనుసరించిన ప్రక్రియ ద్వారా మహిళా అధికారుల కోసం కేటాయించిన 150 ఖాళీల్లో 128 మాత్రమే భర్తీ అయ్యాయని పటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మిగతా 22 ఖాళీలు అలానే ఉన్నాయని తెలిపారు. ఆర్మీలో మహిళలకు తక్కువ పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని వాదనలు వినిపించారు. ఈ విషయంపై అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. పురుష, మహిళా అధికారుల మధ్య ఎలాంటి వివక్ష చూపట్లేదని పేర్కొన్నారు. అలాని తప్పుగా ఊహించుకోవద్దని సూచించారు.

Next Story

Most Viewed