- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
70 ఏళ్ల భామ అద్భుతం.. క్షణాల్లో అరటి గెలలు మాగ పెట్టేసింది(వీడియో)
దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతున్నాయి. కొత్తగా కొంచెం కనిపిస్తే చాలు అది నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయింది. అరటిగెలను ఓ పెద్దమ్మ మాగబెట్టిన తీరు చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
నేల తల్లి ఒడిలో ఉంచి, బొగ్గు నిప్పుల పొగ పెట్టి, గెలను అరటి ఆకులతో కప్పెట్టిన వైనం ఇన్‌స్టా నుంచి ఎఫ్‌బీ వరకు క్యూట్ టాపిక్‌గా మారింది. పచ్చికాయలు కేవలం రెండు రోజుల్లోనే తినడానికి అనువైన పండ్లలా మారడంతో అందరూ ఆమెకు జేజేలు పలికారు. రసాయనాలు చల్లి, కృత్రిమ విధానాలతో మాగబెట్టిన పండ్లను తింటున్న మనం.. ఈ బామ్మగారి కిటుకు ఫిదా అవ్వాల్సిందే.
తమిళనాడుకు చెందిన ఎస్.ఈశ్వరి వయసు 70 ఏండ్ల పైమాటే. సామాజిక మాధ్యమాల్లో ఆమె హుషారుగా ఉంటుంది. సొంతంగా ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ అనే యూట్యూబ్ చానెల్ కూడా నడుపుతున్నది. ఆమె నిర్వహిస్తున్నఈ చానెల్‌కు 12.5 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీటిని వేదికగా చేసుకొని ఆమె షేర్ చేస్తున్న వంటలు కొత్తపాఠాలు నేర్పుతున్నాయి. ‘సాంప్రదాయ రుచులను మళ్లీ పరిచయం చేస్తున్నందుకు థాంక్యూ’ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.