- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన డర్టీ రోగ్ రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది.. ఆకునూరి మురళి సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆదివారం ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. కొంతమంది మూర్కత్వమైన రాజకీయాలు చేస్తారు, పరిణితి లేని రాజకీయాలు చేస్తారు, కులాల పునాదుల మీద రాజకీయాలు చేస్తారు భరించవచ్చు.. అని పేర్కొన్నారు. కానీ ఒక దశాబ్దం పాటు రాజ్యాంగ విలువలు మాట్లాడుకుంటూ విద్య, అవినీతి గురించి ప్రసంగాలు దంచి, విలువల తో రాజకీయాలు చేస్తామని రాజకీయాలలోకి వచ్చి తన క్యారక్టర్‌ను 180 డిగ్రీలు మార్చుకుని డర్టీ రోగ్ రాజకీయాలు చేస్తుంటే చూడడానికి జుగుప్స (అసహ్యం) కలుగుతుంది.. అని విమర్శించారు. దీనికి కారణం ఏం చేసి అయినా అధికారం లోకి వెళ్ళాలి బాగా సంపద పోగేసుకోవాలి అనే దుగ్దనే కదా.. అని ఆకునూరి తన అభిప్రాయం తెలిపారు.
నువ్వు రాజకీయాల్లోకి వచ్చి చూపించు..
మనుషులు ఇట్లా కూడా ఉంటారా ? ఈ మధ్యన సామాజిక రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతుంది.. అని ఆకునూరి పేర్కొన్నారు. అందరూ సంతోషంగా సాధికారికతతో శాంతియుతంగా మంచి జీవన ప్రమాణాలతో బ్రతికేటట్లు ఈ సమాజాన్ని ఎలా మార్చాలో మార్పుకు పునాదులు ఎట్లా వెయ్యాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన రాజకీయ నేత గురించే ఆకునూరి ట్వీట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. బయట కూర్చుని సూక్తులు చెప్తే ఎలా? రాజకీయాలు చేస్తూ ఇదే అసలైన రాజకీయాలు అని చూపండి. రాజకీయాల్లోకి వచ్చి చూపించు.. అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.