నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో.. ఫైనల్ రూట్ ఇదే..!

by Mahesh |
నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో.. ఫైనల్ రూట్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను అదిగమించడం కోసం ప్రతిష్టాత్మకంగా మెట్రో సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి దశలో పూర్తైన మెట్రోకు భారీ స్పందన రావడంతో రెండో దశ మెట్రో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పలు మార్గాల్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంస్థను ఆదేశించింది. దీంతో నాగోల్ నుంచి చంద్రయనగుట్ట వరకు దాదాపు 14 కిలోమీటర్ల మెట్రోను నిర్మించడానికి రూట్ ఖరారు చేసిట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివారులో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో లైన్ పోడిగించే విదంగా ఈ రూట్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు. ఈ లైన్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభం అయి.. నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, ఎల్బీనగర్ సర్కిల్, సాగర్ రింగ్ రోడ్, మైత్రి నగర్ మీదుగా చంద్రయన్గుట్ట వరకు మొత్తం 14 స్టేషన్లు వస్తాయని వారు పేర్కొన్నారు. ఈ రూట్ మ్యాప్ కూ ప్రభుత్వం అంగీరించి, లాండ్ పుల్లింగ్ చేస్తే.. అతి త్వరలోనే మెట్రో రెండో దశ పనులు ప్రారంభం అవ్వనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed