- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.